ఆతిథ్య సేవలందించే సంస్థ ఓయో అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి కోసం ప్రత్యేకంగా 60 శాతం డిస్కౌంటు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. కేవలం నీట్ పరీక్ష రాసే వారికి మాత్రమేనంటూ షరతు పెట్టింది. ఈ నెల 17న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరుగనుంది. దాదాపు 18 లక్షల మంది హాజరవుతున్నారు. దీంతో వారిని ఆకట్టుకోవడానికి కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. దీన్ని వినియోగించుకోవాలనుకునేవారు ముందు ఓయో యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేసి నియర్ బై ఐకాన్ని క్లిక్ చేస్తే విద్యార్ధిని రాసే పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉండే ఓయో హోటళ్ల లిస్టు వస్తుంది. అందులో నచ్చిన హోటల్ని ఎంచుకొని కూపన్ ఎంటర్ చేస్తే రాయితీ వస్తుంది. తర్వాత బుకింగ్ బటన్ నొక్కితే నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.