ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సియం చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. అయితే ఈరోజు పివీ సింధు విజయవాడలోని గొల్ల పూడిలో ఉన్న ఏపీ భూపరిపాలన (సీసీఎల్ఏ) కమీషనర్ కార్యాలయానికి వెళ్లి..తాను ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్ ఏ ప్రధాన కమీషనర్ పునేఠాకు రిపోర్టు చేశారు.అయితే ఇన్నిరోజులు ఆటకే పరిమితమైన సింధు..ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా పబ్లిక్ కు సేవలు చేస్తుదన్నమాట, డిప్యూటీ కలెక్టర్ కు ఏం ఏం బాధ్యతలుంటయ్…ఏం ఏం పన్లు జెయ్యాలే అని అధికారులు ముందుగాళ్ల సింధుకి ట్రేనింగ్ ఇస్తరట.మొత్తానికి ఇన్నిరోజులు శేతిల బ్యాట్ వట్టుకొని బ్యాట్ మెంటన్ ఆడిన సింధు.. ఈకాన్నుంచి శేతుల పెన్నుగుడ వట్టుకొని ఫైల్స్ మీద సంతకం బెడ్తదన్నట్టు.ఆల్ ది బెస్ట్ టు శిన్న కలెక్టర్ సింధు.