థర్డ్ డిగ్రీ కి పాల్పడిన ఎస్పీ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? నేరేళ్ల ఘటనలో వంద శాతం సాండ్ మాఫియా ఉంది.గుప్పెడు సాండ్ మాఫియా కోసం..చట్టాన్ని పక్కన బెడుతున్నారు.
కేటీఆర్ కు దమ్ముంటే.. విచారణ చేయించాలి,అని అఖిలపక్షనేతలు ఆరోపించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అఖిలపక్ష నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా డీజీపీని ఆదేశించాలని నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, బాధితులకు పరిహారం చెల్లించి భద్రత కల్పించాలని కోరారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, లక్ష్మణ్, చాడ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఈనెల 21,22 లో అఖిల పక్షం తరుపున రాష్ట్రపతిని కలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అనంతరం రాజ్‌భవన్ బయట నేతలు మీడియాతో మాట్లాడుతూ..సాండ్ మాఫియా గుట్టు తేల్చాలని గవర్నర్ ను కోరామని,నేరెళ్ల ఘటనను ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తుంది, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు సరిగా లేదన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించే సమయం కూడా ఆయనకు లేదా? అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని.. బాధితులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు.