షాపింగ్ ‌మాల్‌లో.. అయోధ్య రామ మందిరం! - MicTv.in - Telugu News
mictv telugu

షాపింగ్ ‌మాల్‌లో.. అయోధ్య రామ మందిరం!

October 26, 2020

 Ram

వినియోగదారులను ఆకర్షించడానికి పశ్చిమ ఢిల్లీలోని పసిఫిక్‌ షాపింగ్‌మాల్‌ యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది. దీపావళి పండుగా వస్తుండడంతో మాల్‌ మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో 32 అడుగుల ఎత్తు, 48 అడుగుల వెడల్పు ఉన్న అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేసింది. దీన్ని రూపొందించడానికి 80 మంది నిపుణులు 45 రోజులు కష్టపడ్డారు.

‘ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో షాపింగ్ మాల్‌ను అలంకరిస్తూ ఉంటాం. ఈ ఏడాది‌ సిబ్బంది, యాజమాన్యం, విక్రయదారులతో చర్చలు జరిపి అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేశాం.’ అని షాపింగ్ మాల్ సిబ్బంది ఒకరు మీడియతో తెలిపారు. ఈ మందిరం నమూనాను ఏర్పాటు చేసినప్పటినుంచి వినియోగదారుల తాకిడి ఎక్కువైందన్నారు.