ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే కండోమ్ ప్యాకెట్ ధర కూడా పెంచేశారా అని కంగారు పడకండి. కండోమ్ ప్యాకెట్ రూ. 60 వేలు అన్న మాట నిజమైనప్పటికీ .. మన దేశంలో మాత్రం కాదులేండి. వెనిజులా దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక్క కండోమ్ ప్యాక్ భారత కరెన్సీలో ఏకంగా రూ. 60 వేలకు చేరింది. అయితే ఈ రేంజ్లో కండోమ్ ధర పెరగడానికి అక్కడి చట్టాలే కారణం. ఆ దేశంలో అబార్షన్లు చట్ట విరుద్ధం. దీంతో జనాలు పెద్ద ఎత్తున కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు.
2015 ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా యువతులు గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో అబార్షన్ చట్టాలను కఠినతరం చేశాయి. దీంతో పెద్ద ఎత్తున కండోమ్‌లకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం వెనిజులాలో నెలకొన్ని పరిస్థితులపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. కండోమ్ ధరలు ఈ రేంజ్లో పెరగడంతో ఆ దేశంలో ప్రజలు ఏం చేయలేని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు.