Packets of 2000 notes found floating in Ajmer's Anasagar lake, a total of one crore notes recovered
mictv telugu

చెరువులో కొట్టుకొచ్చిన 2 వేల నోట్ల కట్టలు… పోలీసులు రావడంతో..

May 7, 2022

Packets of 2000 notes found floating in Ajmer's Anasagar lake, a total of one crore notes recovered
రాజస్థాన్‌లోని ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. అది చూసిన కొందరు ఆ నోట్ల కట్ట కట్టలను తీసుకొని జేబుల్లో వేసుకొని వెళ్లిపోదామని ప్రయత్నించారు. ఇంతలోనే పోలీసులు అక్కడి రావడం, ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడంతో.. వారి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆనాసాగర్ సరస్సులో శుక్రవారం 2000ల నోట్ల కట్టలు తేలియాడాయి. నీటిలో తేలుతున్న నోట్ల కట్టలను ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నోట్ల కట్లలోని కొన్నింటినైనా తమ సొంతం చేసుకోవాలని కొందరు ప్రయత్నించారు. అయితే అప్పటికే సమాచారం అందుకొని పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

పాలిథిన్ బ్యాగుల్లో ఉన్న నోట్ల కట్టలను సరస్సు నుంచి బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 54 బండెల్స్ ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని,ఈ మొత్తం రూ.1.08 కోట్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ నోట్లు నకిలీవా, అసలు నోట్లా అనేది ఇంకా తెలియరాలేదు.