విశాఖపట్టణం పరిధిలో కేంద్ర వ్యవసాయ శాఖలో పెరిగిన కలుపు మొక్కని సీబీఐ పట్టుకుంది. మొక్కల సంరక్షణ అధికారిగా పనిచేస్తున్న ఆర్. పదంసింగ్ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ధృవీకరణ పత్రాలు జారీ చేసే స్థాయిలో ఉన్న పదం సింగ్.. వాటి కోసం లంచాలు బాగా తిన్నారనే ఆరోపణ ఉంది.
దీంతో పక్కా నిఘా వేసిన సీబీఐ.. విశాఖ కార్యాలయంలో పదంసింగ్ రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతేకాక, విశాఖ, కాకినాడు, ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఏకకాలంలో దాడులు చేసి రూ. 1.86 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. పదంసింగ్తో పాటు అవినీతి కేసులో మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది.