అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థుల విజయఢంకా మోగించడం మామూలే. కాంగ్రెస్(పార్లమెంట్) ఎన్నికల్లో, రాష్ట్రాల ఎన్నికల్లో రెండుమూడు సార్లు ఎన్నికైన భారత సంతతి నేతలు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. వరంగల్లో జన్మించి అమెరికాలో స్థిరపడిన పద్మ కుప్ప రెండోసారి మళ్లీ విజయం సాధించారు.
ఆమె మిచిగాన్ 41వ జిల్లా నుంచి రాష్ట్ర ప్రతినిధుల సభ(అసెంబ్లీ) తిరిగి ఎన్నియ్యారు. ఈ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ కూడా ఆమెనే కావడం గమనార్హం. డెమోక్రాట్ల తరపున ఆమె పోటీ పడ్డారు. 1966లో వరంగల్లో జన్మించిన పద్మ బాల్యంలోనే తల్లిదండ్రుల వెంట అమెరికాకు వెళ్లారు. 1980వ దశకంలో తిరిగి భారత్కు వచ్చిన ఆమె హైదరాబాద్లోని స్టాన్లీ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారుం. వరంగల్ నిట్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఉన్నత చదువుల కోసం మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. మిచిగాన్లోని ట్రాయ్లో స్థిరపడిన ఆమె రెండేళ్ల స్థానిక ప్లానింగ్ కమిషనర్ గా పనిచేశారు. ఆమె ప్రస్తుతం ట్రాయ్ హిస్టారికల్ సొసైటీ అధ్యక్షురాలిగా, మిచిగన్ రౌండ్ టేబుల్ ఫర్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ సభ్యురాలిగానూ ఉన్నారు.