రేప్ జరిగినప్పుడే ఎందుకు చెప్పరంటే... ట్రంప్‌ వర్సెస్ పద్మాలక్ష్మి… - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ జరిగినప్పుడే ఎందుకు చెప్పరంటే… ట్రంప్‌ వర్సెస్ పద్మాలక్ష్మి…

September 26, 2018

బాలీవుడ్ నటి క్రిస్టీన్ బ్లాసీని టార్గెట్ చేస్తూ, అమెరికా అధ్యక్షడు ట్రంప్ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘రేప్ జరిగినప్పడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. 1980లో జరిగితే ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు? వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టమరీ ట్రంప్ పోస్ట్ పెట్టారు. ఈ విషయంలో కొందరు ట్రంప్‌కు మద్దతిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. భారత సంతతి మోడల్ పద్మాలక్ష్మి మండిపడుతూ ప్రముఖ దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’కు లేఖ రాసింది. తనకెదురైన అనుభవాన్ని తెలుపుతూ, ట్రంప్ పద్దతిని దుయ్యబట్టింది.  Padma Lakshmi: I Was Raped at 16 and I Kept Silent‘ఆనాటి ఘటన గత వారం నుంచి నన్ను వెంటాడుతోంది. ఇద్దరు రేపుకు గురైనప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని సుప్రీంకోర్టులో లాయర్లు అడిగారు. అందుకే నేను స్పందిస్తున్నాను. నాకు అప్పడు 26 ఏళ్లు, నా బాయ్‌ఫ్రెండ్‌కు 23ఏళ్లు ఉంటాయి. నాపై ఓ రోజు రాత్రి అత్యచారం చేశాడు. నేను భరించలేనంత నొప్పితో బాధపడుతున్నా వదలకుండా తన కోరిక తీర్చుకున్నాడు. పడుకుంటే నొప్పి దానంతట అదే తగ్గిపోతుందని చెప్పాడు. నా కళ్లవెంట నీరు కారుతున్నా వదల్లేదు. ఆ తర్వాత నన్ను ఇంట్లో దించేసి వెళ్లిపోయాడు. దీన్ని నేను ఏమని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఈ ఘటనపై నేను పోలీసులకుగానీ, మా అమ్మకు గానీ చెప్పలేదు. నా తొలి అనుభూతి నాకు బాధనే మిగిల్చింది. జరిగినదాన్ని నేను అత్యాచారం అనిగానీ, సంభోగం అనిగానీ చెప్పను. కానీ నేను కన్యత్వాన్ని కోల్పోయాను. అంతకన్నా ముందే… అంటే నాకు ఏడేళ్ల వయసున్నప్పుడే నా సవతి తండ్రి అసభ్యంగా తాకడం నాకింకా గుర్తుంది. ఈ విషయం గురించి అమ్మకు తెలిసిందో ఏమో, కొన్నేళ్ల పాటు నన్ను ఇండియాలోని తాతయ్య దగ్గరకు పంపించింది’ అని తన లేఖలో రాసుకొచ్చింది.

తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి చెబితే ,సూటిపోటీ మాటలను పడాల్సి వస్తుందని మహిళలు చెప్పరు. చెబితే అదే దృష్టితో చూస్తారని, ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకు రావడం లేదు. తన 8 ఏళ్ల కుతూరికి ఓ మంచి స్నేహితురాలిగా అన్ని విషయాలను చెబుతానని, ఆమెను ఫిజికల్, మెంటల్‌గా ఫిట్‌గా ఉంచడమే తన లక్ష్యమని చెప్పింది.