పద్మశ్రీ మొగులయ్య ఇంట్లో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

పద్మశ్రీ మొగులయ్య ఇంట్లో విషాదం

May 4, 2022

పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య కుటుంబంలో విషాదం నెలకొంది. రోడ్డుపై ప్రమాదవశాత్తు జారిపడి ఆయ‌న కుమార్తె బుద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివాహం అనంత‌రం భ‌ర్త చ‌నిపోవ‌డంతో 16 ఏండ్లుగా తండ్రి వ‌ద్ద‌నే ఉంటున్న ఆమె.. సోమవారం ఇంటి ఎదురుగా ఉన్న బిటి రోడ్డుపై జారిప‌డింది.

తలకు తీవ్ర గాయాలు కావ‌డంతో , కుటుంబ సభ్యులు అచ్చంపేట దవాఖానకు తీసుకువెళ్ల‌గా అప్పటికే మృతి చెందినట్లు డాక్ట‌ర్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు జరిపారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మొగులయ్యను ఫోన్లో పరామర్శించారు.