పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో పాట పాడడం ద్వారా ఫేమస్ అయిన వ్యక్తి మొగులయ్య. ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్న మొగులయ్య ఢిల్లీ నుంచి తన స్వస్థలం అచ్చంపేటకు చేరుకున్నారు. అయితే మొగులయ్య చేసిన ఒక పని అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చంపేట పట్టణంలో మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి చిరిగిన బట్టలతో, పెరిగిన చింపిరి జుట్టుతో మొగులయ్యకు ఎదరుపడ్డాడు. అతని పరిస్థితి చూసి చలించిన మొగులయ్య బట్టలు కొని స్వయంగా తొడిగించారు. ఈ ఘటనను చూసిన స్థానికులు మొగులయ్యను అభినందించారు. కాగా, అంతరించిపోతున్న 12 మెట్ల కిన్నెర కళను ఇప్పటికీ కాపాడుతున్న వ్యక్తి దర్శనం మొగులయ్య. ఆ కళతోనే అనేక సత్కారాలు, పురస్కారాలు ఆయనను వరించాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పేరు మార్మోగిపోయేలా చేశాయి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొగులయ్య ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించేలా ఆర్టీసీ సౌలభ్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే.