‘ ప్యాడ్ మ్యాన్ ’ ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీని పెంచిన అక్షయ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ ప్యాడ్ మ్యాన్ ’ ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీని పెంచిన అక్షయ్ !

August 4, 2017

అక్షయ్ కుమార్ సినిమాల స్పీడును నిజంగానే పెంచాడా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆగస్టు 11 కు రిలీజ్ అవుతున్న ‘ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ’ గురించి ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తుండగానే తన ఇంకో లేటెస్ట్ ఫిల్మ్ ‘ ప్యాడ్ మ్యాన్ ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. సైకిల్ మీద దిగువ మధ్య తరగతి యువకుడిలా వున్న అక్షయ్ స్టిల్ ను చూసినవాళ్ళలో క్యూరియాసిటీని పెంచుతోంది. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తప్పకుండా వినూత్న తరహాలో వుంటుందని బాలీవుడ్ సమాచారం.

షమితాబ్, కీ అండ్ కా, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి డిఫరెంట్ సబ్జెక్టులతో హ్యూమన్ రిలేషన్ ను టచ్ చేస్తూ దానికి ఎమోషన్ ఫ్లేవర్ అద్దే బాల్కీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఇంట్రెస్టింక్ గా వుందంటున్నారు. బాల్కీ ఏ సినిమాలోనైనా అమితాబ్ బచ్చన్ తప్పకుండా వుంటాడు. ఇందులో కూడా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సోనమ్ కపూర్, రాధికా ఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నానే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 13 ఏప్రిల్ 2018 కి రిలీజ్ కు సిద్ధమౌతోంది. దీని రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగానే అక్షయ్ తన నెక్ట్స్ సినిమా అప్ డేట్స్ ఇస్తుండొచ్చు. వరుసలో ఫస్ట్ ‘ రోబో 2.0 ’ వుంది, దాని తర్వాత ‘ ఫైవ్ ’ ‘ హౌజ్ ఫుల్ 4 ’ అనే సినిమాలు నిర్మాణ దశలో వున్నాయి. బాలీవుడ్ లో ఇప్పుడు ఫాస్టుగా సినిమాలు చేస్తూ చాలా మంది కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక హీరో అక్షయ్ కుమార్. ఇలాగే మంచి మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుందాం.