సినీ పరిశ్రమ మీద కక్ష లేదు.. మంత్రి పద్మారావు..!
హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటిగా చేయడమే లక్ష్యంగా కదులుతున్నాం అని మంత్రి ప్రద్మారావు అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నమని తెలిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీ లో ప్రత్యేకంగా ఎవరిపైనా కక్ష సాధింపు చేయడం లేదని అన్నారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. దోషులు ఎంతటివారైనా శిక్షిస్తాం అని అన్నారు.. ఇప్పటివరకు 3000 ల యూనిట్ల LSD ని, 45 గ్రాముల కొకైన్ ,వేరే నార్కోటిక్ ,సైకోట్రోపిక్ పదార్ధాలను ను రికవరీ చేసినట్టు వివరించారు. సినిమా పరిశ్రమలోని 12 మందికి, 11 బార్లు మరియు పబ్ లకు నోటీసులు జారీ చేశాం అని అన్నారు. జూన్19 నుండి జులై 2 వరకు నోటిసులు ఇచ్చిన వారందరినీ ప్రశ్నించడం జరుగుతుందని తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
దాదాపు 26 స్కూళ్ళు, 27 కాలేజీలు మరియు 25 ఐటికి సంబందించిన కంపెనీలలో చదువుతున్న, పనిచేస్తున్న వారు ఈ డ్రగ్గు ను అరెస్టు అయిన వారినుండి తీసుకున్నట్టుగా సమాచారం రాబట్టాం అన్నారు. ఇన్వెస్టిగేషన్ పురోగతి లో వున్నందున ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కుదరదని అన్నారు. స్కూళ్ళ మరియు కాలేజీల విద్యార్ధులను ఈ డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవలసిన అన్నీ చర్యలను జాగ్రత్తలను చేపట్టడం జరుగుతుందని మంత్రి అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపైనా నిఘా పెట్టి, వారి ప్రవర్తనను గమనించాలని అన్నారు. డైరెక్టర్, ఆకున్ సబర్వాల్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపద్యం లో అవసరమైతే భద్రత పెంచి ఈ డ్రగ్ కేసు ను పురోగతి సాధిస్తాం అని మంత్రి అన్నారు.