రావమ్మా.. పద్మావతీ రావమ్మా.. మా హాళ్లలో కొలువై ఉందువు గానీ.. - MicTv.in - Telugu News
mictv telugu

రావమ్మా.. పద్మావతీ రావమ్మా.. మా హాళ్లలో కొలువై ఉందువు గానీ..

November 24, 2017

వివాదాస్పద బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’పై రాజకీయాలు బాగా పండుతున్నాయి. ఈ సినిమాపై బీజేపీ పాలిత  రాష్ట్రాలు నిషేధం వేటు వస్తోంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. మోదీ సర్కారుపై విరుచుకుపడుతున్న పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. పద్మావతి నీరాజనం పడుతున్నారు. ఈ మూవీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, నటి దీపికా పదుకునే తదితరులను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా  ఆహ్వానించారు.పద్మావతి  సినిమాను స్వాగతిస్తున్నామని, ఈ సినిమాను వేసే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని ఆమె  చెప్పారు. ‘వేరే ఏ రాష్ట్రంలో సినిమాను విడుదల చేయలేకపోతేనేం.. మా రాష్ట్రానికి రండి. మేం ఈ సినిమా ప్రదర్శన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఇందుకు బెంగాల్‌ గర్వపడుతుంది. ఎంతో సంతోషిస్తుంది’ అని మమత ఓ కార్యక్రమంలో చెప్పారు.