పద్మావతితో పోటీ పడుతున్న జోలా.. - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతితో పోటీ పడుతున్న జోలా..

November 21, 2017

వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’పై ఎంత రచ్చసాగుతోందో అందరికీ తెలిసిందే. ఓ పక్క రాజకీయ నాయకులు తిట్టిపోసుకుంటున్నారు. మరోపక్క నెటిజన్లు మాత్రం ఈ గొడవను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పద్మావతిలోని ఘూమర్ డాన్స్‌ చేసిన దీపికా పదుకునే మాదిరే డ్యాన్స్ చేస్తున్న గొరిల్లా వీడియో వైరల్ అయింది. ఓ పెద్ద టబ్బులో గొరిల్లా గింగిరాలు తిరుగుతూ నాట్యం చేస్తోంది. పద్మావతితో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే నిజానికి ఈ జంతువుకు పద్మావతి పాటతో సంబంధం లేదు. ఎక్కడో తీసిన గొరిల్లా వీడియోకు ఘూమర్  డ్యాన్స్‌ను జత చేసి ఈ స్ఫూఫ్ వీడియో రూపొందించారు. ఈ గొరిల్లా పేరు జోలా.. అమెరికాలోని డాలాస్ జూలో ఉంటోంది. దీని వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియో ఫేమస్ అయ్యాయి.