దీపికకు హావీవుడ్ నటి మద్దతు - MicTv.in - Telugu News
mictv telugu

దీపికకు హావీవుడ్ నటి మద్దతు

November 18, 2017

బాలీవుడ్ వివాదాస్పద మూవీ ‘పద్మావతి’కి దేశంలోని సినీ ప్రముఖులు పెద్దగా అండగా నిలబడకోయినా ఒక హాలీవుడ్ నటి ముందుకొచ్చి మద్దతు పలికింది. ఈ మూవీలై టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకునేకు నటి రూబీ రోస్ అండగా నిలిచింది. దీపిక పోరాటానికి హాట్సాఫ్ చెబుతున్నాననంటూ ట్వీట్ చేసింది. రూబీ గతంలో దీపిక నటించిన హాలీవుడ్ మూవీ ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్స్‌ ఆఫ్‌ క్జాండర్‌ కేజ్‌‘ నటించింది.

పద్మావతి వివాదంపై రూబీ స్పందిస్తూ.. ‘నా స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకుని  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె చేస్తున్న పోరాటానికి హాట్సాఫ్‌. నాకు తెలిసిన ధైర్యవంతులైన  మహిళలలో దీపిక ఒకరు’ అని ట్వీట్ చేసింది.  పద్మావతి మూవీకి ప్రకాశ్ రాజ్ వంటి వాళ్లు తప్ప బాలీవుడ్ నుంచి మద్దతు కొరవడింది. మూవీని సమర్థిస్తే హిందూ సంస్థలు, ముఖ్యంగా బీజేపీ నుంచి అనవసర విమర్శలు వస్తాయని పలువురు గుంభనంగా ఉంటున్నారు.