తలలకు వెలలా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? - MicTv.in - Telugu News
mictv telugu

తలలకు వెలలా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?

November 24, 2017

పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా తలలకు వెలలు కట్టడంపై ప్రముఖ దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. ‘ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు. అందులో ఏముందో ఎవరూ చూడనే లేదు. అప్పుడే విమర్శలా? ’ అని మండిపడ్డారు. నటి దీపిక, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తలలకు వెలకట్టడం ఏమిటి? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అని ఆయన ప్రశ్నించారు.పద్మావతి మూవీ వివాదం ఉత్తరాది నుంచి క్రమంగా దక్షిణ భారతానికి పాకుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమా విడుదల కాకుండా నిషేధం విధించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు లేఖ రాశాడు.