పద్మావతి గొడవ చూసి ఓ ఊరు నవ్వుకుంటోంది.. ఎందుకు? ఏమా కథ? - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతి గొడవ చూసి ఓ ఊరు నవ్వుకుంటోంది.. ఎందుకు? ఏమా కథ?

November 25, 2017

బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’పై వివాదం తలలకు వెలల దాకా వెళ్లిపోయింది. నహర్‌గఢ్ కోటలో ఒక మనిషి కూడా చచ్చిపోయాడు.. దీపిక పదుకోనెనేకు, భన్సాలీకి పోలీసు భద్రత కల్పించారు. రాజ్ పుత్ కర్ణిసేన, బీజేపీ నేతలు పద్మావతిని బెదిరిస్తున్నారు.. ఇదంతా మనకు తెలిసిందే.అయితే ఈ రచ్చను చూసి ఒక ఊరి జనం నవ్వుకుంటున్నారు.. ‘వీళ్లు మరీ ఇంత వెధవలా? అసలు పద్మావతి గురించి వీరికేం తెలుసు.. మా వద్దకు రండి.. ఆమె గురించి నేర్పిస్తాం.. ’ అని అంటున్నారు.

ఆ ఊరిపేరు.. జాయిష్.. యూపీ రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పద్మావతి కథకు ఆధారమైన పద్మావత్ కావ్యం పుట్టింది అక్కడే. ఆ వూరికి చెందిన మాలిక్ మహమ్మద్ జాయిషి అనే కవే ఈ కావ్యాన్ని రాశాడు 16 వ శతాబ్దిలో. అవధి భాషలో రాసిన ఈ కావ్యంలో.. హిందూ, ముస్లిం మతాల మధ్య సామరస్యాన్ని బోధించారని, ఇప్పుడు సినిమా సాకుతో ఆయన కోరుకున్న స్వప్నాన్ని భగ్నం చేస్తున్నారి స్థానికులు మండిపడుతున్నారు.

పద్మావత్ రచనలోని చాలా పద్యాలు ఈ ఊరి ప్రజలకు నోటికి వచ్చు. ‘నేను స్కూలో ఆ పాఠం చదువుకున్నాను. సినిమాను వ్యతిరేకిస్తున్నవాళ్లు ఎవరూ ఆ సినిమాను చూడలేదు. పుస్తకాన్నీ చదవడం లేదు. కేవలం రాజకీయ కారణాలతోనే నిరసన తెలుపుతున్నారు.. ’ అని మహమ్మద్ నిజాం ఖాన్ చెప్పాడు.

పద్మావతి కావ్యంలో ఉన్న..

‘దేవుడు నాటింది ఒకటే మొక్క

దానికి రెండు కొమ్మలున్నాయి..

కలసి జీవిస్తున్న ప్రజలే ఆ కొమ్మలు..

హిందూ, ముస్లింలు అందరూ ఆ దేవుడి బిడ్డలే’ అన్న పద్యాన్ని పాడాడు ఖాన్..

జాయిషి.. కొన్ని వాస్తవాలకు కొంత కల్పన జోడించి ‘పద్మావత్’ రాశాడని, ఆయన ప్రజల మధ్య సామరస్యాన్ని కోరుకున్నాడని అసీఫ్ జాయిషీ అనే పండితుడు చెప్పాడు.