20 వేలకు కొన్నాడు.. 6.7 కోట్లు పలుకుతోంది! - MicTv.in - Telugu News
mictv telugu

20 వేలకు కొన్నాడు.. 6.7 కోట్లు పలుకుతోంది!

May 16, 2019

అదృష్టలక్ష్మి ఎప్పుడు, ఎవరిని ఎలా కరుణిస్తుందో చెప్పలేం. అందుకే ‘రాయి రాయి అనుకున్నది ఒకనాటికి రత్నమౌనురా’ అని జోస్యం చెప్పాడో తెలుగు సినీ కవి. చవక ధరకే వస్తోంది కదా అని ఓ వ్యక్తి రూ. 20 వేలు పెట్టిన కొన్న పెయింటింగ్ ఇప్పుడు రూ. 6.7 కోట్ల ధర పలుకుతోంది.

Painting bought at cheep rate could be worth of crores as it confirmed painted by Picasso go to auctions.

బ్రిటన్‌లోని వెస్ట్ ససెక్స్‌కు చెందిన ఫిలిప్ సేట్‌ఫ్లెటన్‌కు పాత వస్తువులు సేకరించడం, అమ్మడం అలవాటు. అతడు ఆర్నెళ్ల కిందట  ఓ యాంటిక్స్ దుకాణానికి వెళ్లాడు. అందులో పికాసో వేసినట్లు చెబుతున్న ‘సీటెడ్ బాతర్’ అనే పెయింటింగ్ కనిపించింది. ధర 230 పౌండ్లని(రూ. 20 వేలు) చెప్పారు. ప్రపంచప్రఖ్యాత చిత్రకారుడైన పికాసో చిత్రం అంత తక్కువ రేటుకు వస్తుందా అని ఫిలిప్ అనుమానించాడు. ఏదైతేనేంలే ఇంట్లో పెట్టుకోడానికి బాగుంటుంది కదాని కొనేశాడు. ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్నాడు. తర్వాత అమ్మాలనిపించి బ్రైటన్ అండ్ హోవ్ యాక్షన్స్ వేలం సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ ప్రతినిధి రోజీ మే సదరు చిత్రాన్ని నిశితంగా పరీక్షించి అది పికాసో వేసిన చిత్రమేనని నిర్ధారించింది. పెయింటింగ్ వెనక రొనాల్డ్ పెన్ రోజ్ ఎస్టేట్ అని రాసి ఉంది. రొనాల్డ్.. పికాసోకు మంచి మిత్రుడు. ఆ వివరాలను. పెయింటింగ్ శైలిని విశ్లేషించి రోజీ మే అది పికాసో కుంచెలోంచి జాలువారిన చిత్రమేనని తేల్చేసింది.

‘మొదట వాళ్లు నన్ను ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నాను. కానీ తర్వాత విషయం చెప్పేసరికి మాటరాలేదు..’ అని ఫిలిప్ పొంగిపోతున్నాడు. జూన్‌లో జరిగే వేలంలో ఈ చిత్రాన్ని రూ. 6.7 కోట్ల ప్రారంభ ధర పెట్టి అమ్మేయనున్నారు.