గాంధీ, మోదీ పెయింటింగ్‌‌కు రూ.25 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ, మోదీ పెయింటింగ్‌‌కు రూ.25 లక్షలు

October 26, 2019

odi and Mahatma.

ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో లభించిన బహుమతుల ప్రదర్శన, ఈ-వేలం ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. సాంస్కృతిక శాఖా ఈ వేలాన్ని సెప్టెంబర్ 14 నుంచి నిర్వహించింది. 

మువ్వన్నెల పతాకం నేపథ్యంగా జాతిపిత మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీల చిత్రాలున్న అక్రిలిక్‌ పెయింటింగ్‌ భారీ ధర పలికింది. అన్ని బహుమతుల్లో అత్యధికంగా గాంధీ, మోదీలున్న పెయింటింగ్‌కు రూ.25 లక్షలు లభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేలం ద్వారా లభించిన డబ్బును ప్రభుత్వం నమామి గంగా మిషన్‌కు విరాళంగా ఇవ్వనుంది.