పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం విడుదల తేదీ సెప్టెంబర్ 1న దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరుమీదున్నాయి. మూవీ మేకర్స్ సినిమాలోని ఒక్కొక్క సాంగ్ ని ప్రోమోలుగా విడుదల చేస్తున్నారు. తాజాగా అనూప్ రూబెన్స్ రూపొదించిన సాంగ్ ‘కొంటె నవ్వు’ పాటను విడుదల చేశారు.
ఈ పాట ఎన్టీఆర్, వాణిశ్రీలు నటించిన అలనాటి హిట్ మూవీ ‘జీవిత చక్రం’ లోని పాటకి రీమేక్. ఈ పాటలో బాలయ్య చేసిన డ్యాన్స్ ప్యాన్స్ ను తెగ పిచ్చెక్కిస్తోంది. ఈ సినిమాలో శ్రేయ, ముస్కాన్ లు కథానాయికలుగా నటించారు. కైరా దత్ స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుంది. మరి తాజాగా విడుదలైన రీమేక్ సాంగ్ పై మీరూ ఓ లుక్కెయ్యండి..