చైనాకు ఎదురుదెబ్బ.. సీపెక్ అథారిటీని రద్దు చేసిన పాక్ - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు ఎదురుదెబ్బ.. సీపెక్ అథారిటీని రద్దు చేసిన పాక్

April 22, 2022

8

పాకిస్తాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాలనలో తన మార్కు చూపిస్తున్నాడు. చైనా – పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టు అథారిటీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 60 బిలియన్ డాలర్ల (రూ. 4.50 లక్షల కోట్లు) వ్యయం అంచనాతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. చైనాలోని టిబెట్ ప్రాంతమైన షిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్ బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టు వరకు మౌలిక సదుపాయాలు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. చైనా ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు మీద 30 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల చైనాకు ఇంధన సరఫరా, మధ్య ఆసియాతో రోడ్డు, రైలు సౌకర్యం కోసం ముందస్తు వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేయదలిచారు. అయితే దీని వల్ల పాకిస్తాన్‌కు ఏరకంగా చూసినా మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆ దేశ మీడియా , ప్రతిపక్షాలు, మేధావులు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు. తాజాగా అథారిటీ రద్దు నేపథ్యంలో ఆదేశ ప్రణాళికా మంత్రి ఈ ప్రాజెక్టును ‘దేశ వనరులను వృథా చేసే అనవసర సంస్థ’గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు పీఓకే నుంచి వెళ్తోంది. దీనిపై అప్పట్లో భారత ప్రభుత్వం తన అభ్యంతరం వ్యక్తం చేసింది.