Pak militant died in BSF firing
mictv telugu

అమర్‌నాథ్ యాత్రే లక్ష్యం.. పాక్ ఉగ్రవాది కాల్చివేత

June 27, 2022

అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. బఖూర్పూర్ బార్డర్ ఔట్ పోస్టు వద్ద అర్ధ రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సరిహద్దు వద్ద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ముందుకు రాకుండా అక్కడే ఆగిపోవాలని హెచ్చరించాయి. అయినా ఉగ్రవాది వినకపోవడంతె బలగాలు మూడు రౌండ్ల కాల్పులు జరిపాయి. ఉదయం వెళ్లి చూడగా, కంచె పక్కనే మృతదేహం కనిపించింది. తనిఖీ చేయగా ఎలాంటి ఆయుధాలు అతని వద్ద లభించలేదు. దర్యాప్తు కోసం శవాన్ని పోలీసులకు అప్పగించారు. కాగా, ఇంకో మూడ్రోజుల్లో ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం అవుతుండగా, ఈ ఘటన జరగడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. అటు కశ్మీర్‌లోనే జరిగిన మరో ఘటనలో ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతని వద్ద చైనీస్ పిస్తోల్, రెండు మ్యాగజీన్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.