పాపం పాక్ మినిస్టర్.. మోదీ పేరు ఎత్తగానే షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

పాపం పాక్ మినిస్టర్.. మోదీ పేరు ఎత్తగానే షాక్..

August 30, 2019

Pak Minister Sheikh Rashid Comments On Pm Mod

దాయాది దేశం పాకిస్తాన్ భారత్ పై ప్రతిరోజు విమర్శలు చేస్తూనే ఉంది. అక్కడి ప్రతి నేత కేంద్ర ప్రభుత్వంపై ఏదో రకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాక్ తమ నోటికి పనిచేబుతోంది. రోజూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టుగా మోదీని విమర్శించబోయిన అక్కడి రైల్వే మంత్రికి ఊహించని విధంగా షాక్ తగిలింది. వెంటనే ఉలిక్కిపడాల్సి వచ్చింది. 

కశ్మీర్‌ అవర్‌ కార్యక్రమంలో పాల్గొన్నమంత్రి షేక్‌ రషీద్‌కు భారత ప్రధానిపై విమర్శల దాడి పెంచారు. ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తున్నాడు. నరేంద్ర మోదీ అంటూ ప్రసంగించగానే ఆయనకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఒక్కసారిగా ఆయన ఉలిక్కి పడటంతో అంతా భయపడిపోయారు. ఆ వెంటనే తనకు షాక్ వచ్చిందని చెబుతూ.. ఈ సమావేశాన్ని మోదీ విఫలం చేయలేరంటూ వ్యాఖ్యానించారు. తర్వాత షరా మామూలే అన్నట్టుగా విమర్శలు చేశారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్ జోలికి వస్తే అలానే ఉంటుంది. మోదీ పేరు ఎత్తితేనే షాక్ కొట్టింది. ఇక భారత్ జోలికి వస్తే ఎలా ఉంటుందో చూసుకొండి అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.