Pak minister urges people to reduce tea drinking
mictv telugu

దయనీయ స్థితిలో పాక్.. తాగుడు తగ్గించాలని మంత్రి వినతి

June 15, 2022

Pak minister urges people to reduce tea drinking

పాక్ మంత్రి చేసిన ఓ ప్రకటన ఆ దేశ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపుగా వాడుకునే క్రమంలో టీని తక్కువగా తాగమని ప్రజలకు సూచించాడు ఓ మంత్రి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార ధాన్యాల కొరత, చమురుపై అధిక సబ్సిడీ వంటి సమస్యలతో ఆ దేశం మరో రెండు నెలల్లో శ్రీలంకలా మారబోతోంది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. ‘టీ పౌడర్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం.

ప్రపంచంలో అతి పెద్ద దిగుమతి దారులలో మన దేశం ఒకటి. గత ఆర్ధిక సంవత్సరంలో దేశంలో రూ. 2 వేల కోట్ల విలువైన టీ వినియోగించాం. ప్రస్తుతం గతం కంటే రూ. 400 కోట్ల అధిక పౌడర్‌ని దిగుమతి చేసుకున్నాం. రోజూ తాగే టీని దిగుమతి చేసుకోవాలంటే కూడా అప్పు చేయాల్సి వస్తోంది. కావున రోజుకు రెండు సార్లు టీ తాగకుండా విదేశీ మారక ద్రవ్య పొదుపుకు సహకరించండి’ అంటూ మనవి చేసుకున్నారు. అంతకు కొద్ది రోజుల ముందు రాజధాని ఇస్లామాబాద్‌లో రాత్రి 8.30 దాటితే ఎలాంటి ఫంక్షన్లకు అనుమతి లేదని మరో మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఫంక్షన్లలో ఒకే వంటకాన్ని వడ్డించాలని ఆదేశించారు. విద్యుత్ ఆదా చేయడానికి ఉద్యోగుల పనిదినాలను కూడా వారానికి తగ్గించారు.

కాగా, సంక్షోభ పరిస్థితులను తప్పించడానికి పాక్ గతంలో ఐఎంఎఫ్ వద్దకు తాత్కాలిక రుణం కోసం వెళ్లింది. అయితే అది పెట్టిన షరతులకు తలొగ్గక వెనక్కి తిరిగింది. ఇప్పుడు కొద్ది రోజుల్లో తిండి గింజలకు కూడా కటకట ఏర్పడే పరిస్థితులు రావడంతో తిరిగి దాని దగ్గరికే వెళ్లింది. దాంతో ఆ సంస్థ అనేక షరతులు పెట్టింది. ఇప్పుడు వాటికి ఎదురు చెప్పే ధైర్యం లేకపోవడంతో షరతుల ప్రకారం సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు. ఇటు భారత్‌తో వాణిజ్యం లేకపోవడంతో భారత వస్తువులను వయా దుబాయ మీదుగా దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల భారం పెరిగిపోయి, దివాళా తీసే వరకు తెచ్చుకుంది. ఇన్నాళ్లూ దొంగ భారత కరెన్సీ, ఆఫ్ఘాన్ పేరుతో అమెరికా నుంచి భారీ ఆర్ధిక సహాయం, చైనా నుంచి సీపెక్ పేరుతో రుణాలు వంటి వాటితో నెట్టుకొచ్చిన పాక్, ఇప్పుడు అవేవీ లేకపోవడంతో తన బతుకు తనకు తెలిసొచ్చింది. అయితే ఏ దేశం కూడా సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ దేశం అంతర్యుద్ధం దిశగా పయనించబోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.