హైదరాబాదీని చంపిన పాకిస్తానీకి యావజ్జీవ జైలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదీని చంపిన పాకిస్తానీకి యావజ్జీవ జైలు

September 13, 2019

Pak national ..

హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని హత్యచేసిన పాకిస్తాన్ దేశస్తుడికి లండన్‌ క్రౌన్‌ కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెరోల్‌ దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. 

తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన పాకిస్తాన్, యూకే పౌరసత్వం కలిగిన అకీబ్ పెర్విజ్‌(27) హైదరాబాద్‌కు చెందిన తన సహా ఉద్యోగి నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌(24)ను ఈ ఏడాది మేలో ప్రజలు చూస్తుండగానే పొడిచి చంపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మొహమ్మద్‌ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మొహమ్మద్‌ను కిరాతకంగా చంపాడని మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.