పాక్ ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్! - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్!

August 30, 2019

Imran Khan.

సరిహద్దు దేశం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. పాకిస్థాన్‌లో ఎటు చూసినా నిధుల కొరత.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాక్షాత్తూ ప్రధాని కార్యాలయానికి కరెంట్ ఉంటుందా.. ఊడుతుందా అన్న పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా ఖాళీ అవుతుండటంతో.. ప్రధాని కార్యాలయానికి కరెంట్ బిల్లు చెల్లించలేదు. కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేస్తామని అధికారులు నోటీసులు పంపుతూ హెచ్చరిస్తున్నారు.

ఇమ్రాన్‌ఖాన్ కార్యాలయం గత కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లులు కట్టలేదంటా.. ఇప్పటికి రూ.41 లక్షలు బకాయిలు ఉండటంతో బిల్లు చెల్లించాలంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ నోటీసులు జారీ చేసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపినా ప్రధాని కార్యాలయం నుంచి స్పందన రాకపోవడంతో.. బుధవారం మరోసారి నోటీసులు పంపింది. అయితే ఈ సారి బిల్లు కట్టకపోతే.. కరెంట్ కట్ చేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించింది. భారత్‌తో యుద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న ఇమ్రాన్.. మొదట కరెంట్ బిల్లు కట్టేందుకు డబ్బులు సంపాదించుకో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.