Home > Featured > అస్సాం ఎన్నార్సీపై ఇమ్రాన్ ఖాన్‌కు అనుమానాలు

అస్సాం ఎన్నార్సీపై ఇమ్రాన్ ఖాన్‌కు అనుమానాలు

అస్సాంలో చొరబాటుదారుల నిగ్గు తేల్చేందుకు పౌరుల జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్సీ) శనివారం విడుదల చేసింది. సుమారు 19 లక్షల మందిని భారతీయల జాబితాలో చేర్చలేదు. అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన వారిని తిరిగి పంపాలంటూ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఉద్యమం చేపట్టింది. సుమారు ఆరు సంవత్సరాల పాటు ఆందోళన చేపట్టారు. అస్సాం ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 1985లో నిరసనను విరమించారు. అప్పటి నుంచి ఎన్‌ఆర్సీ చొరబాటుదారులను గుర్తించాల్సి ఉండగా తాజాగా జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం అసోంలో ఉన్న 3,11,21,004 మంది భారత పౌరులుగా గుర్తింపును పొందారు.

అయితే ఈ పౌర జాబితాపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కశ్మీర్ అంశాన్ని జోడిస్తూ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం జాతి నిర్మూలనే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ భారత, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమాద సంకేతాలుగా పరిగణించాలని, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి కశ్మీర్ దురాక్రమణ అనేది ఓ విస్తృత విధానంలో భాగమని ఇప్పటికే నిరూపితమైందని ఆరోపించారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేసారు. అస్సాం పౌర జాబితాలో లేని లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ మీడియాలో వచ్చిన ఓ వార్తను కూడా ట్వీట్‌తో జత చేశారు.

Updated : 31 Aug 2019 8:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top