మతం మార్చి బలంతపు పెళ్లి.. పాకిస్తాన్‌లో కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

మతం మార్చి బలంతపు పెళ్లి.. పాకిస్తాన్‌లో కలకలం

August 30, 2019

పాకిస్తాన్‌లో బలవంతపు మతమార్పిడి ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. మైనార్టీ మతానికి చెందిన అమ్మాయిలను ఇస్లాంలోకి మార్పించి చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ సిక్కు మత పూజారి కూతురునే ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నాడు.  గురునానక్ జన్మస్థానమైన నాన్‌కనా సాహెబ్‌లో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. మత మార్పిడి తర్వాత ఇద్దరూ కలిసి ముస్లిం సంప్రధాయంలో వివాహం చేసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై సిక్కు మతస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మహ్మద్ ఎహ్సన్ అనే ముస్లిం యువకుడు భగవాన్ సింగ్ అనే వ్యక్తి కూతురును ఆగస్టు 27న కిడ్నాప్ చేశాడు. బాలికను బలవంతగా ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకున్నాడు. ముస్లిం పెద్ద మౌల్వి ఖురాన్‌లోని వాక్యాలను చదువుతుండగా అమ్మాయి అతడి పక్కన భయపడుతూ కూర్చుంది. తన వయసు 19ఏళ్లని, ఇంటిలో నుంచి తాను ఎటువంటి విలువైన వస్తువులు తీసుకురాలేదని వీడియోలో చెప్పించారు. ఇష్టప్రకారమే ఎహ్సాన్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపింది.  దీనిపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆ యువతికి ఇదివరకే పెళ్లి జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె భర్త వ్యాపారం కోసం ఫైసలాబాద్ వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి 2 గంటల సమయంలో ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.