ఎన్నికల ఫలితాల రోజున ఉగ్రదాడులకు రెడీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల ఫలితాల రోజున ఉగ్రదాడులకు రెడీ..

May 17, 2019

Pak terrorist plan for terror attack on India.

పాక్ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు మళ్లీ భారత్‌పై ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారు. మే 23న విరుచుకుపడటానికి పన్నాగం పన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆరోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్లాన్ చేసినట్టు తెలిపారు. టెర్రరిస్టులు తమ టార్గెట్లుగా ఎంచుకున్న వాటిలో శ్రీనగర్‌, అవంతిపుర వైమానిక స్ధావరాలు ఉన్నట్టు ఓ స్కెచ్ ద్వారా తెలుస్తోంది. సొపియాన్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాది మృతదేహం నుంచి ఆ స్కెచ్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఈనెల 14న పుల్వామాలో ఉగ్ర కమాండర్లు భేటీ అయ్యారు. వాళ్లలో హిజ్బుల్‌ ముజహిదీన్‌కు చెందిన రియాజ్‌ నైకూ, ఇద్దరు జైషే టెర్రరిస్టులు, లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్‌ దర్‌లు పాల్గొన్నారు. భద్రతా, సాయుధ దళాలపై ఉగ్రదాడికి పథకం రచించాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే మే 23న భారీ ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారని తెలిపాయి.