pak vs nz semifinala match
mictv telugu

సెమీఫైనల్ ..పాక్ టార్గెట్ 153

November 9, 2022

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. మిచెల్ అర్థసెంచరీతో రాణించగా..కేన్ విలియమ్స్ న్ 46 పరుగులు చేసాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు.. నవాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.. షాహీన్ అఫ్రిది వేసి మొదటి ఓవర్ మూడో బంతికి అలెన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత కాన్వాయ్ (21)ను షాదాబ్ ఖాన్ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్ చేసాడు. గ్లెన్ పిలిప్స్ కూడా విఫలం కావడంతో కేన్ విలియమ్స్ న్ మిచెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్స్ న్ ఔటయ్యాక వచ్చిన నీషమ్ 12 బంతుల్లో 16 పరుగులు చేసాడు. చేతిలో వికెట్లు ఉన్న పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో న్యూజిలాండ్‌కు భారీ స్కోర్ చేయడం కష్టమైంది.