సరిహద్దులో పాక్ యుద్ధవిమానాలు..దాడికి కాదు, వణుకుపుట్టి..  - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దులో పాక్ యుద్ధవిమానాలు..దాడికి కాదు, వణుకుపుట్టి.. 

May 11, 2020

Pakistan Air Force jets increased patrols

ఇటీవల హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ అశుతోష్ శర్మతో సహా ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెల్సిందె. దీనికి జవాబుగా భారత ఆర్మీ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన ముఖ్యమైన కమాండర్ నైకూను హతం చేసింది. ఈ పరిణామాలతో పాకిస్తాన్ భయపడింది. దీంతో నియంత్రణ రేఖ వెంట యుద్ధ విమానాల కదలికలను పెంచింది.

ఇందులో భాగంగా పాకిస్తాన్ కు చెందిన ఎఫ్-16, జెఎఫ్-17, మిరాజ్-3 యుద్ధ విమానాలు సరిహద్దుల్లో చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ కార్యకలాపాల దృష్ట్యా, భారత సైన్యం పూర్తిగా అప్రమత్తమైనది. పాకిస్తాన్ వైమానిక దళం ప్రతీచర్యను సరిహద్దుల్లో పర్యవేక్షిస్తున్నారు. భారత వైమానిక దళం వైమానిక స్థావరాలు కూడా పూర్తి అప్రమత్తతో ఉన్నాయి. పాకిస్తాన్ విమానాల కదలికలను పర్యవేక్షించడానికి వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థ ఎప్పటికప్పుడు సూచనలను అందిస్తోంది.