పాక్ ఆర్మీ పాటను కాపీ కొట్టిన రాజాసింగ్.. అసిఫ్ గఫార్ ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ ఆర్మీ పాటను కాపీ కొట్టిన రాజాసింగ్.. అసిఫ్ గఫార్ ఆరోపణ

April 15, 2019

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ‘హిందుస్తాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌.. హర్‌ దిల్‌కీ అవాజ్‌..’ అనే పాటను పాడిన సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటను తన అధికారిక ట్విటర్‌లో రాజాసింగ్‌ షేర్‌ చేస్తూ.. భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ పాటను రాజాసింగ్‌ కాపీ కొట్టారని పాక్‌ ఆర్మీ ఆరోపించింది.

మార్చి 23 పాకిస్తాన్‌ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ పాటకు కాపీ కొట్టారని పేర్కొంది. ఈ పాటను సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషంగా ఉందని, కానీ కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలి కదా! అని పాకిస్తాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు రాజాసింగ్‌ పాడిన సాంగ్‌ను కూడా జతచేశారు. రాజా సింగ్‌.. ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ పాటను ‘హిందూస్తాన్‌ జిందాబాద్‌’ గా మార్చి భారత సైన్యానికి అంకితమిచ్చారని పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది.