పాక్ విపరీత బుద్ధి.. సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ విపరీత బుద్ధి.. సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన

September 29, 2020

jhgfdd

భారత్ – పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. మంగళవారం ఉదయం పూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులో కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికులే లక్ష్యంగా తూటాలు కురిపించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ అధికారులు తిరిగి కాల్పులు జరిపారు. ప్రతి కాల్పులతో పాక్ సైన్యం తోక ముడిచి పారిపోయింది. 

పాక్ సైన్యం కాల్పుల విరమణకు తూట్లు పొడిచిందని ఆరోపించారు. షెల్లింగులు, మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ప్రతి దాడి చేయడంతో పారిపోయారని వెల్లడించారు. ఈ చర్యలపై భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఏడాది 44 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింద భారత సైన్యం వెల్లడిచింది.