కరోనా రోగులను భారత్ సరిహద్దులో వదిలేస్తున్న పాక్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రోగులను భారత్ సరిహద్దులో వదిలేస్తున్న పాక్

March 26, 2020

Pakistan army shifting corona covid patients to indian boarder

పాకిస్తాన్ పరమ నీచనికృష్ట కక్షకాండకు ఇది తాజా ఉదాహరణ. భారత్‌పై దాని కుళ్లకుతంత్రాలకు రోగిష్టి నిదర్శనం ఇది. కరోనా సోకిన వారిని, కరోనా లక్షణాలు ఉన్నవారిని పాకిస్తాన్ ముష్కర సైనికులు భారత్ సరిహద్దులోని పీఓకో, గిల్గిత్-బాల్టిస్తాన్‌లలో వదిలేస్తున్నారు! దీనిపై అక్కడి  ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. పాక్ అధీనంలో ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో కొన్నాళ్లుగా ఈ తతంగం సాగుతోంది. అసలే అక్కడ వైద్య సదుపాయాలు తక్కువ కావడంతో కరోనా రోగులు మిగతా వారికి కూడా వ్యాధిని అంటించే అవకాశముంది. మరింత తేడా వస్తే మన దేశంలోని జమ్మూకశ్మీర్, లద్దాక్ ప్రజలకు కూడా ముప్పు తప్పదు. ఇప్పటికే జమ్మూ కశ్మర్‌లో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో పాక్ పాపిష్టి పనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఎక్కడి నుంచి.. 

భారత్ సరిహద్దులోనే ఉన్న పాక్ లోని పంజాబ్ రాష్ట్రం నుంచి కోవిడ్ పేషంట్లను పీఓకేకే తీసుకెళ్తున్నారు. వారిని పీఓకే, గిలిత్ బాల్టిస్తాన్‌లలోని మీర్‌పూర్‌, ముజపరాబాద్,  దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. నామమాత్రం సౌకరర్యాలతో టెంట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. 19 మంది రోగులును తీసుకొచ్చారని, తాళాలు వేసిన ట్రక్కుల్లో మిగతా రోగులను పట్టుకొస్తున్నారని పీఓకే వాసులు చెబుతున్నారు. పాక్ పంజాబ్‌లోని సైనిక సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందికి వ్యాధి సోకకుండా సైనికులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు పీఓకే వాసులు ఆరోపిస్తున్నారు. ముప్పు ఎవరికైనా ముప్పేనని, రోగులు ఎక్కడికక్కడ ఐసొలేషన్ లో ఉంచి చికిత్స చేయాలని కోరుతున్నారు.