పాక్ కాల్పుల్లో భారత జవాను మరణం - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ కాల్పుల్లో భారత జవాను మరణం

October 1, 2020

Pakistan Army Violations in Border

సరిహద్దుల్లో పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. తరుచూ భారత సైనికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడుతోంది. ఇటీవల పూంచ్ సెక్టార్‌లోనూ ఇలాగే చేయడంతో భారత బలగాలు తిప్పికొట్టాయి. తాజాగా ఎల్ఓసీ వెంబడి మరోసారి బరితెగించింది. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టారులో కాల్పులు జరపడంతో ఓ జవాను అమరుడయ్యాడు. 

సరిహద్దుల్లో డ్యూటీలో ఉన్న జవానులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. దీంట్లో లాన్స్ నాయక్ కర్నాల్ సింగ్ మరణించాడు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన  భారత సైనికులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. కర్నాల్ సింగ్ కు తోటి సైనికులు నివాళి అర్పించారు. అంత్యక్రియల కోసం అతని మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.