అంతర్జాతీయ సమాజం ముందు ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ మరోసారి భంగపాటుకు గురైంది. లేని రాయబారిని వెనక్కి తీసుకుని రావడానికి తీర్మానం చేసింది. దీంతో పాక్ చర్యపట్ల ప్రపంచ దేశాల ప్రజలు నవ్వుకుంటున్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. మహ్మద్ ప్రవక్త కార్టూన్ల ప్రచురణను సమర్థించారు. దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇస్లాంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలవాలని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. వాస్తవానికి ఫ్రాన్స్‌లో పాకిస్తాన్ కు ఎలాంటి రాయబారి లేడు. ఈ విషయం ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి తెలిసినా తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై ప్రజలు జోక్స్ వేస్తున్నారు.