హనుమంతుడి గద కొట్టేసిన పాక్! - MicTv.in - Telugu News
mictv telugu

హనుమంతుడి గద కొట్టేసిన పాక్!

October 30, 2017

‘పాకిస్తాన్ అసెంబ్లీలో మన హనుమంతుడి వెండిగద’, ‘పాకిస్తానీలు కూడా మారుతి భక్తులే’, ‘ఆ గదను వెనక్కి తిరిగి భారత్కు తీసుకురావాలి’.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై భారతీయుల కామెంట్లు ఇవి. ఈ వీడియో 2014 నాటిది.

అందులో సరదా సాగుతున్న సభ్యుల సంభాషణలు కాకుండా స్పీకర్ పోడియం మీదున్న వెండి గద ఇప్పుడు అందరి దృష్టినీ అకర్షిస్తోంది. అసలు అది అక్కడికెలా వచ్చిందో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ఆయుధాలకు పూజ చేసిన తర్వాత స్పీక‌ర్ పోడియం మీద ఉంచాల‌నే సంప్ర‌దాయం ఉంద‌ని ఒక నెటిజన్ చెప్పాడు. స‌మావేశాలు జరుగుతున్నాయనేందుకు అది ప్రతీక అట.