టమాటా నగలు.. పెళ్లికూతురు ఆక్రోశం..   - MicTv.in - Telugu News
mictv telugu

టమాటా నగలు.. పెళ్లికూతురు ఆక్రోశం..  

November 19, 2019

Pakistan Bride Wears tomato Jewelry

టమాట ధరలు కొండెక్కుతున్నాయి. మనదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోనూ ఇదే పరిస్థితే. దొంగలు కూడా టమాట పంటలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో పంట మార్కెట్‌కు రావడమే గగనంగా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్ రైతులు తుపాకులతో కాపలా ఉంటూ టమాట పంటను రక్షించుకుంటున్నారు. భారత్ నుంచి ఉల్లిగడ్డలు, టమాటాలు, ఆలుగడ్డల దిగుమతులు తగ్గిపోవడంతో పాక్‌లో పరిస్థితి మరింత దిగజారింది. 

అక్కడ కేజీ టమాట ధర గరిష్ఠంగా రూ.320కి చేరింది. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి కూతురు వినూత్నంగా నిరసన తెలిపారు. వివాహ వెడుకల్లో బంగారు అభరణాలకు బదులుగా టమాటాలను ధరించి వార్తల్లోకి ఎక్కారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెళ్లి వేడుకల్లో బంగారు నగలకు బదులు టమాటాలు ధరించారేంటని ఓ మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించగా..‘పాకిస్తాన్‌లో బంగారం, టమాట ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకే బంగారు నగలకు బదులుగా టమాట ఆభరణాలు ధరించాను. నా పుట్టింటి వాళ్లు, బంధువులు కూడా నాకు కానుకగా టమాటాలనే తీసుకొచ్చారు’ అని తెలిపారు. వ్యవసాయరంగంపై పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సదరు పెళ్లి కూతురు వ్యంగస్త్రాలు సంధించారు.