హిందువుల ఇళ్ల కూల్చివేత..పాక్ మంత్రి సమక్షంలో - MicTv.in - Telugu News
mictv telugu

హిందువుల ఇళ్ల కూల్చివేత..పాక్ మంత్రి సమక్షంలో

May 22, 2020

Pakistan bulldozes settlements of Hindu minorities in Punjab’s Bahawalpur

దాయాది దేశం పాకిస్తాన్ లో మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ జిల్లాలో క్రిస్టియన్ల ఇళ్లు, స్మశాన వాటికను ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు ధ్వంసం చేసిన సంగతి తెల్సిందే.

తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో హిందువులు నివసిస్తోన్న ఓ బస్తీ మొత్తాన్ని పాక్ ప్రభుత్వాధికారులు బుల్‌డోజర్లతో నేలమట్టం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, దేశ ప్రధాన సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. మైనారిటీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల దేశ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టిన కొద్దిరోజులకే పాక్ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడటం సంచలనమవుతోంది.