అమెరికా, పాకిస్తాన్.. కస్సు బుస్సు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా, పాకిస్తాన్.. కస్సు బుస్సు..

August 29, 2017

మిత్రదేశాలైన అమెరికా, పాకిస్తాన్ ల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందంటూ అమెరికా అధ్యక్షడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం. ఇందుకు నిరసనగా అగ్రరాజ్యంతో దైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నామని పాక్ ప్రకటించింది. వచ్చే నెల ఐక్యరాజ్యసమితిలో జరిగే జనరల్ అసెంబ్లీకి పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ హాజరవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇరు దేశాలు చర్చలు జరపాలి. అయితే ట్రంప్ మాటలపై కస్సుబుస్సుమంటున్న పాక్ ఆ చర్చలకు రాంరాం చెప్పేసింది. పాక్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోతే సైనిక, ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు.

అస్థిర రాజకీయాలతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదని అమెరికా భావిస్తోంది. సాయాన్ని తగ్గిస్తామని బెదిరించడం ద్వారా ఆ దేశాన్ని దారి పెట్టొచ్చన్నది పెద్దన్న వ్యూహం. ఆధునిక టెక్నాలజీ, ఆయుధాలు తదితరాల కోసం పాక్ అమెరికానే శరణువేడుతోంది.