Pakistan, cop, Rs 100 million in account,bank blocks,Account, ATM card
mictv telugu

పోలీస్ అధికారి అకౌంట్లో రూ.10కోట్లు జమ

November 7, 2022

Pakistan, cop, Rs 100 million in account,bank blocks,Account, ATM card

ఆ పోలీసులు రాత్రికిరాత్రే కోటిశ్వరులు అయ్యారు. అకౌంట్లలో వేలు, లక్షలు కాదు కోట్లకొద్దీ డబ్బులు జమ అయ్యాయి. ఈ డబ్బు ఎక్కడ నుంచి జామ అయిందో వారికే తెలియదు. బ్యాంక్ అధికారులు ఫోన్ చేసి చెప్పడంతో అవాక్కయ్యారు.పోలీస్ అధికారులకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? టెక్నకల్ మిస్టేక్ తో జమ అయిందా..లేక ఎవరైనా వారి అకౌంట్లల్లో వేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అమీర్ గోపంగ్…ఇన్వెస్టిగేషన్ అధికారి.పాకిస్థాన్‌లోని కరాచీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తాడు. ఓవర్ నైట్‌లో ఇతను కోటీశ్వరుడిగా మారిపోయాడు. అమీర్ శాలరీ అకౌంట్‌లో ఒకేసారి రూ. 10 కోట్లు జమ అయ్యాయి. అధికారులు ఫోన్ చేసి చెప్పేదాకా అతనికి ఈ విషయం తెలియదు. “మీ అకౌంట్లో వంద కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అనౌన్ సోర్స్ నుంచి ఈ డబ్బులు వేశారు. ప్రస్తుతం మీ అకౌంట్ , డెబిట్ కార్డు బ్లాక్ చేస్తున్నాం” అని బ్యాంకు అధికారులు చెప్పారు.

“నా అకౌంట్‌లో 10 కోట్లు చూసి షాక్ అయ్యా. జీవితంలో ఎప్పుడు ఇంత డబ్బు చూడలేదు. వందలు, వేలే ఇప్పటిదాకా చూశా.ఇప్పుడు 10 కోట్లు చూసి షాక్ అయ్యా” అని అమీర్ చెబుతున్నాడు. ఇతనికే కాదు మరికొందరు పోలీస్ అధికారుల అకౌంట్లలో పెద్దమొత్తంలో డబ్బులు జమ అయ్యాయి. లార్కానా, సుక్కూరు ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారుల ఖాతాల్లో రూ 5 కోట్ల చొప్పున క్రెడిట్ అయ్యాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.