యాసిన్ మాలిక్‌పై అఫ్రిది.. ధీటుగా బదులిచ్చిన క్రికెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

యాసిన్ మాలిక్‌పై అఫ్రిది.. ధీటుగా బదులిచ్చిన క్రికెటర్

May 30, 2022

భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడంలో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ముందు వరుసలో ఉంటారు. అనేక అంశాల్లో భారత్‌ను విమర్శిస్తూ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తుంటాడు. ఇటీవల జీవిత ఖైదు పడిన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితికి వెళ్లాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశాడు. అదే క్రమంలో మరోసారి యాసిన్ మాలిక్ గురించి మాట్లాడాడు. ఆయనను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. మాలిక్‌పై భారత ప్రభుత్వం తప్పుడు అభియోగాలు మోపిందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ అమిత్ మిశ్రా ధీటుగా బదులిచ్చారు. ‘నీ బర్త్ సర్టిఫికెట్ లాగా అన్నీ తప్పుడుగా ఉంటాయని అనుకోవద్దు’ అని చురకంటించాడు. కాగా, గతంలో పాకిస్తాన్ జాతీయ జట్టుకు సెలెక్ట్ అవడం కోసం అఫ్రిది ఫేక్ సర్టిఫికెట్ సమర్పించాడు. ఈ ఉదంతం అప్పట్లో పాకిస్తాన్‌లో పెద్ద వివాదం అయింది. అఫ్రిది ఎవరి గురించైనా చెడుగా మాట్లాడితే వాళ్లు ఈ విషయాన్ని ముందుకు తెస్తుంటారు.