పాకిస్తాన్‌లో నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి. కేజీ చికెన్ రూ. 720, కేజీ టీ పొడి రూ. 1600, కేజీ గోధుమ రూ. 140 పలుకుతోంది. ఇవి దిమ్మదిరిగే రేట్లే. అంతకుముందు ధరలతో పోలిస్తే ఇవి ఎక్కువే. మన దేశంలోని ధరలతో పోలిస్తే మాత్రం పెద్ద తేడా ఏమీ లేదు. ఇంచుమించు సమానంగా, కొన్ని సరుకులైతే మనదేశంలోకంటే చవకే అని చెప్పుకోవాలి. కానీ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం పాక్‌లో ధరల సంక్షోభం, కొండెక్కిన ధరలు అని చెబుతున్నాయి. అయితే ఆ ధరలు పాకిస్తాన్ కరెన్సీలో అన్న విషయాన్ని మాత్రం చెప్పవు. దీంతో మనదేశంలోని ధరలతో అక్కడ ధరలను పోల్చుకుని వామ్మో అని హార్చర్యపోతుంటాం. విషయం పూర్తిగా తెలిస్తే ముటుకు.. వార్నీ, ఇక్కడా అంతేగా, ఇంతేగా అంటాం.
కరెన్సీ విలువ తక్కువ
పాకిస్తాన్ రూపాయి మన రూపాయితో పోలిస్తే మూడో వంతు మాత్రమే. ఒక భారతీయ రూపాయి పాక్ లో రూ. 3.26 పైసలకు సమానం. అంటే మన రూపాయి విలువే ఎక్కువ. అందుకే నిత్యావసరాల ధరలను ఏ దేశ కరెన్సీలో అన్నది చెప్పకుండా రూపాయల్లో చెప్పేస్తే ఎక్కువ అనిపిస్తాయి.
ధరలు ఇలా..
ఉదాహరణకు ప్రస్తుతం పాక్‌లో కేజీ చికెన్ రూ. 550 నుంచి 720 మధ్య పలుకుతోంది రూ. 720 లెక్కనే తీసుకుంటే ఆ మొత్తం మన దేశ కరెన్సీలో రూ. 220. మనదేశంలోనూ చికెన్ ఇంచుమించు ఈ ధరే పలుకుతోంది. పాక్ లో చికెన్ తక్కువ ధర పలికినప్పుడు ఉదాహరణకు రూ. 450 తీసుకుంటే అది భారత కరెన్సీలో రూ. 139. అంటే మనదేశంలోనే కంటే తక్కువే పలికినట్లు లెక్క. గోధమపిండి పాక్‌లో రూ. 140 అంటే మన దేశంలో రూ. రూ. 42 అని. లీటలు పాలు పాక్‌లో రూ. 190 మన లెక్క ప్రకారం రూ. 58. పాక్‌లో ఇప్పుడు ధరలు పెరిగాయని చెబుతుంటే ఇదివరకు ఉన్న ధరలు మన దేశంలోని ధరలతో పోలిస్తే తక్కువే అన్నమాట. కాకపోతే పాక్ ప్రజలకు మాత్రం అది భారమే. వారు తమ కష్టార్జితంలో మరింత చెల్లించాల్సి వస్తుంది. మనదేశంలో వంటనూనెలుకు, పప్పుధాన్యాలకు మనం గత కొన్నేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ చెల్లిస్తున్నట్టు. ఇదండీ పాక్ ధరల కథాకమామిషు!