పాక్‌లో బాంబు పేలుడు.. 8మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌లో బాంబు పేలుడు.. 8మంది మృతి

May 8, 2019

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. లాహోర్‌లోని అత్యంత పురాతన సూఫీ స్రైన్‌కు దగ్గర బుధవారం జరిగిన బాంబు పేలుడులో 8 మృతి చెందగా.. మరో 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు.

పోలీసుల వాహనం టార్గెట్ గానే ఈ పేలుడు జరిగినట్లు పాక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే దాత దర్బార్ స్రైన్‌ దగ్గర్లోనే ఈ పేలుడు జరిగింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, లాహోర్ ఆపరేషన్స్ డీఐజీ అస్పక్ అహ్మద్ ఖాన్ పేలుళ్లను తీవ్రంగా కండించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి, బాద్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా 2010లోనూ ఇక్కడ ఉగ్రదాడి జరిగి, 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.