మోదీ విమానానికి నో చెప్పిన పాక్.. కారణం ఇదేనట..! - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ విమానానికి నో చెప్పిన పాక్.. కారణం ఇదేనట..!

October 28, 2019

PM Modi............ 

దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత్‌పై అక్కసును వెల్లగక్కేందుకు ఏకంగా ప్రధాని మోదీ ప్రయాణించే విమానం తమ గగతన తలం నుంచి వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. సౌదీ పర్యటన నేపథ్యంలో అనుమతి కోసం భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చింది. భారత హైకమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలిపినట్టు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ప్రకటించారు.

అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొనడం కోసం ప్రధాని మోదీ సోమవారం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతి కోరగా ఆదేశం నిరాకరించింది. దీనికి కారణం కూడా వివరించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నందున తాము మోదీ విమానానికి అనుమతి ఇవ్వలేమి పేర్కొన్నారు. కాగా గత నెల అమెరికా పర్యటన సందర్భంలోనూ పాక్‌ అనుమతి నిరాకరించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐస్‌ల్యాండ్‌ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. బాలాకోట్ దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ తమ గగన తలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.