కశ్మీర్‌లోకి పాక్ డ్రోన్.. కూల్చిపారేసిన భారత్  - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లోకి పాక్ డ్రోన్.. కూల్చిపారేసిన భారత్ 

October 24, 2020

Pakistan drone in Kashmir .jp

సరిహద్దులో పాకిస్తాన్ దుశ్చర్యలకు తెరపడ్డం లేదు. ఒకపక్క దొంగచాటుగా ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపుతూ మరోపక్క కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తోంది. రోజూ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ స్థావరాలపై కాల్పులు జరుపుతూ చావు దెబ్బలు తింటోంది. అయినా బుద్ధిరాకుండా అడ్డదారుల్లోనూ అలజడి రేపడానికి ప్రయత్నిస్తోంది. మొన్నటివరకు రాజస్తాన్, గుజరాత్‌లలోకి డ్రోన్లను పంపి నాశనం చేసుకున్న పాక్ తాజాగా కశ్మీర్ లోకీ ఓ డ్రోన్‌ను పంపింది. అది కూడా దాన్ని పెద్దన్న చైనా తయారు చేసిన డ్రోన్ కావడం విశేషం. 

చైనా కంపెనీ డీజేఐ మావిక్ 2 తయారు చేసిన డ్రోన్ ఒకటి పాక్ వైపు నుంచి భారత్ లోకి చొరబడింది. కెరాన్ సెక్టార్లో చక్కలు కొట్టింది. భారత నిఘా రాడార్లు దాన్ని వెంటనే గుర్తించాయి. ఆర్మీ అప్రమత్తమై దాన్ని కూల్చేసింది. పాక్ బలగాల ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడానికి కుట్రలు పన్నుతున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే ఇటీవల చెప్పారు. భారత జవాన్లను ప్రత్యక్షంగా ఎదుర్కోవడం చేతకాని పాక్ సైనికులు భారత భూభాగంపై అవగాహన కోసం ఇలాంటి డ్రోన్లు పంపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.