ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కోట్ల ఆస్తినష్టం జరుగుతోంది. మరోపక్క యుద్ధం వల్ల కొన్ని దేశాలకు ‘సానుకూల’ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని బ్రిటన్, అమెరికా తదితర జీ 7 దేశాలు ఆంక్షలు విధించడమే దీనికి కారణం. దీంతో రష్యా తన దగ్గర పేరుకుపోయిన లక్షలాది బ్యారెళ్ల చమురు నిల్వలను వదిలించుకోవడానికి కారు చవకగా అమ్మిపారేస్తోంది. భారత్‌తోపాటు పలు దక్షిణాసియా దేశాలకు ముడి చమురును మార్కెట్ ధరకంటే తక్కువగా అమ్ముతోంది. భారత్‌కు ఇస్తున్నారు కదా మాకూ ఇవ్వండని పాకిస్తాన్ కూడా పుతిన్ కాళ్లు పట్టుకుంటోంది. ఆర్థిక సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయిన పాక్.. ఈమేరకు భారీస్థాయిలో లాబీయింగ్ చేస్తోంది. ఒక బ్యారెల్(159 లీటర్లు)ను రూ. 4100(భారత కరెన్సీ)కే ఇవ్వాలని చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర రూ. 6800 పలుకుతోంది. అంటే దాదాపు 3 వేలకు తక్కువకే బ్యారెల్ పొందడానికి పాక్ ప్రయత్నిస్తోందన్నమాట. 4100లకు రష్యా అమ్మితే లీటరు రూ. 25 పడినట్టు. మన దేశం రష్యాల నుంచి బ్యారెల్ ను రూ. 4900 కొంటోంది. ఈ లెక్కలన లీటరు రూ. 30 పడినట్లు. పలు అంశాల్లో పాక్ మద్దతు రష్యాకు అక్కర్లేపోయినా దౌత్య సంబంధాల కోసం రష్యా కనికరించి తక్కువ ధరకే అమ్మే అవకాశముంది.