pakistan enterd into t20 worldcup final
mictv telugu

ఫైనల్లో పాకిస్తాన్..కివీస్‌పై ఘనవిజయం

November 9, 2022

pakistan enterd into t20 worldcup final

అదృష్టంతో వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ ఒడిసిపట్టుకోంది. టీ 20-2022 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో న్యూజిలాండ్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని19.1 బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడం ద్వారా అనూహ్యంగా సెమీస్ లో వచ్చిన పాక్ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకోంది. వరల్డ్ కప్ టోర్న్సీ లోని కీలక మ్యాచ్‌లో ఎప్పటిలాగే కివీస్ ఓటమి చవిచూసి ఇంటి ముఖం పట్టింది.

153 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆ జట్టు ఓపెనర్లు రాణించడంతో లక్ష్య చేధనలో ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. రిజ్వాన్(57), బాబర్ అజమ్(53 లు అర్ధసెంచరీలతో చెలేరేగి
మొదటి వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.హరీష్ కూడా 28 పరుగులతో రాణించడంతో కివీస్‌కు గెలుపుకు అవకాశం లేకుండా పోయింది.

అంతుకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.. షాహీన్ అఫ్రిది వేసి మొదటి ఓవర్ మూడో బంతికి అలెన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత కాన్వాయ్ (21)ను షాదాబ్ ఖాన్ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్ చేసాడు. గ్లెన్ పిలిప్స్ కూడా విఫలం కావడంతో కేన్ విలియమ్స్‌న్ (46) మిచెల్(53) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్స్ న్ ఔటయ్యాక వచ్చిన నీషమ్ 12 బంతుల్లో 16 పరుగులు చేసాడు. చేతిలో వికెట్లు ఉన్న పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో న్యూజిలాండ్‌కు భారీ స్కోర్ చేయడం కష్టమైంది. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.

ఇక గురవారం జరగబోయే భారత్ , ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ విజేతతో ఫైనల్లో పాకిస్తాన్ తలపడనుంది.