టమాట పంటకు తుపాకీతో కాపలా..  - MicTv.in - Telugu News
mictv telugu

టమాట పంటకు తుపాకీతో కాపలా.. 

November 18, 2019

Pakistan farmers armed guard to tomato crop 

ఉల్లితోపాటు టమాటా ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ కేజీ రూ. 100 వరకు ఎర్రపండ్లు కూడా రూ. 70 మార్కు దాటేశాయి. కూరల్లోకి అత్యవసరమైన వీటి దిగుబళ్లు తగ్గడంతోపాటు.. వ్యాపారుల, దళారుల మోసాల వల్ల కూడా సామాన్యుడికి అందుబాటు లేకుండా పోతున్నారు. 

మన దేశంలోనే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోనూ ఇదే పరిస్థితే. పంట మార్కెట్‌కు రావడమే గగనంగా మారింది. ఇక పొలాల్లోని పంటలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. దారిన పొయ్యేవాళ్లు టమాటాను తెంపుకుపోతున్నారు. దీంతో పాకిస్తాన్ రైతులు తుపాకులు ఎక్కుపెట్టి పంటలను రక్షించుకుంటున్నారు. భారత్ నుంచి ఉల్లిగడ్డలు, టమాటాలు, బంగాళాదుంపల దిగుమతులు తగ్గిపోవడంతో పాక్‌లో పరిస్థితి మరింత దిగజారింది. పాక్‌లో టమాట పళ్ల వాహనాలకు గతంలో ప్రభుత్వమే జవాన్లతో కాపలా కాయించింది. బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాక్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.